![]() |
![]() |

కామెడీ స్టాక్ ఎక్స్చేంజి లేటెస్ట్ ఎపిసోడ్ ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేసింది. ఇక హోస్ట్స్ ఇద్దరూ "బుట్టబొమ్మ" సాంగ్ కి డాన్స్ చేస్తూ ఎంట్రీ ఇచ్చారు. దీపికా మెలికలు తిరిగిపోతూ తన డ్రెస్, తన నవ్వు, తన హెయిర్ స్టైల్ ఎలా ఉంది అని అడిగేసరికి సుధీర్ కూడా అంతే మెలికలు తిరుగుతూ బాగున్నావని చెప్పాడు. మరి చైర్మన్ గారికి నచ్చుతానా అనేసరికి సుధీర్ ఏడుపు మొహం పెట్టేస్తాడు.
ఇక సుధీర్ ఆ ఏడుపు ముఖంతోనే చైర్మన్ ని పిలుస్తాడు. అలా కాదు పిలవాల్సింది అని వగలుపోతూ దీపికా మత్తుగా పిలుస్తుంది ఆయన వచ్చేసాడు. రావడంతోనే టీవీ రిమోట్ తీసుకురావడం చూసి "ఇదేంటి రిమోట్ తెచ్చారు" అని సుధీర్ అడిగేసరికి "మనకు లేని ఎంటర్టైన్మెంట్ ఇంట్లో వాళ్లకు ఎందుకు అని రిమోట్ తెచ్చేసానని చెప్పాడు". "ఇది పని చేస్తుందో లేదో చూడు అనేసరికి బాగా పని చేస్తుంది" అని అబద్దం చెప్పాడు సుధీర్. తీరా చూస్తే అందులో బ్యాటరీలు ఉండవ్. "సర్ నాలో చాలా ఎనెర్జీ, పవర్ ఉంది. బ్యాటరీలు లేకపోయినా పని చేసేస్తుంది..అలాంటిది మన పవర్ మీకు కూడా కొంచెం కావాలా" అని అడిగేసరికి ఆ ఒక్క మాటతో చైర్మన్ జేబులో చెయ్యి పెట్టుకుని వచ్చేసి సీటులో కూర్చుంటాడు.
"సరే కానీ ఈ టీవీ రిమోట్ ని ఏం చేయమంటారు" అని సుధీర్ అడిగేసరికి "అలాగే మీ ఇంటికి తీసుకెళ్లి ఏసీకి వాడేసుకో అని అనిల్ రావిపూడి చెప్పాడు. అదేంటి సర్ అలా ఎలా వాడుకోవాలి అనేసరికి కామెడీ చేసానయ్యా కామెడీ స్టాక్ ఎక్స్చేంజి కదా" అన్నాడు.
![]() |
![]() |